తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Rains in Telangana for another two days
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. 

ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంపడే అవకాశముందని వెల్లడించింది.

రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
Go Back to Shorts
Rains
Telangana
IMD

More Telugu News