విజయవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
- రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి
- ఆమె మృతి బాధాకరమన్న చంద్రబాబు
- విహారయాత్ర విషాద యాత్రగా మారడం బాధాకరమన్న లోకేశ్
జ్యోత్స మృతి కలచివేసింది: నారా లోకేశ్
మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి గొల్లపల్లి జ్యోత్స్న రాజస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమని, ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేంద్ర ప్రసాద్, న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.