పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- సీమాంతర ఉగ్రవాదం విధానం ఎన్నటికీ విజయవంతం కాదని వెల్లడి
- దాని ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిక
- పీవోకే నుంచి పాక్ బలగాలు వెళ్లిపోతే అన్ని సమస్యలకూ పరిష్కారం
పీవోకే సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం లభించదని, అక్కడి నుంచి పాక్ బలగాలు వెళ్లిపోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని తేల్చిచెప్పారు. పొరుగు దేశాలపై పాక్ ప్రయోగిస్తున్న సీమాంతర ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశంపైన కూడా ప్రభావం చూపిస్తోందని జైశంకర్ అన్నారు. దీని ఫలితమే పాక్ లో కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతులలోనే జీడీపీని కొలవాలని అన్నారు.