తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!
- 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
- మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ లో 1576, వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ పోస్టులు
- ఆయుష్ శాఖలో 61, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల భర్తీకి చర్యలు
తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలానే ఆయుష్ శాఖలో 61, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీతో పాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు.