హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- రోడ్లపై నిలిచిపోయిన నీరు
- నగరంలో పలుచోట్ల భారీ ట్రాఫిక్ జామ్
- మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్ పేట ప్రాంతాల్లో వర్షం
చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్‌ల నుంచి బయటకు వచ్చే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం కారణంగా చాలామంది వర్షంలో తడవకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద, దుకాణాల ముందు తలదాచుకున్నారు.