కొత్త కస్టమర్లకు ఆకర్షణీయమైన ప్లాన్లు ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
- రూ.108 ప్లాన్‌తో 28 రోజులపాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనం
- 45 రోజుల వ్యాలిడిటీతో రూ.245 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్
- కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఆఫర్లు ఆవిష్కరిస్తున్న కంపెనీ
రూ.108, రూ.249 ధరలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్లు అపరిమిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్, హై-స్పీడ్ 4జీ ఇంటర్నెట్ వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్లు కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రూ. 108 ప్లాన్ వివరాలు..
అత్యంత చౌక అయిన రూ.108 ప్లాన్‌లో కస్టమర్లు 28 రోజుల పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. నేషనల్ రోమింగ్‌ను కూడా ఈ ప్లాన్ కవర్ చేస్తుంది. అంతేకాదు 1 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనం అందుబాటులో లేదు.
రూ. 249 రీఛార్జ్ బెనిఫిట్స్..
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 45 రోజులుగా ఉంది. నేషనల్ రోమింగ్‌తో పాటు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా పొందవచ్చు. అంతేకాదు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది.