ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

AP Govt Released Asst Professor Job Notification
  • 488 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం
  • డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకం
  • సెప్టెంబర్ 9 తో ముగియనున్న దరఖాస్తు గడువు
ఆంధ్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా వచ్చే నెల 9 తో గడువు ముగియనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈమేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మెంబర్ సెక్రెటరీ వివరాలు వెల్లడించారు. బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయని, డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నియామకాలను శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://dme.ap.nic.in https://apmsrb.ap.gov.in/msrb/ సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు.
Advertisement
Job Notifications
Andhra Pradesh
Asst Professor
Medical College

More Telugu News