అక్రమ కేసులు, అరెస్టులు తప్ప జగన్ చేసిందేమీ లేదు: కొల్లు రవీంద్ర
- ఐదేళ్ల పాలనలో జగన్ చేసిందేమీ లేదన్న కొల్లు రవీంద్ర
- మత్స్యకారుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసేలా జీవో 217 తీసుకొచ్చారని మండిపాటు
- మత్స్యకార సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ
ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ... మత్స్యకారుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసేలా జీవో 217 తీసుకొచ్చారని... మత్స్యకారులకు ఉన్న హక్కులను ప్రైవేటు పరం చేసేందుకు యత్నించారని విమర్శించారు. ఈ జీవోను రద్దు చేయడం ద్వారా మత్స్యకారుల హక్కులను కాపాడామని చెప్పారు. త్వరలోనే మత్స్యకార సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.