తిరుపతిలో కూడా స్వామివారి ధనాన్ని దోచుకున్నారు: అచ్చెన్నాయుడు
- రవాణాశాఖలో భారీగా అక్రమాలు జరిగాయన్న అచ్చెన్నాయుడు
- రాష్ట్రాన్ని జోన్లుగా విడగొట్టి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణ
- అక్రమాలను వెలికి తీస్తామనే భయంతో ఫైళ్లను తగులబెడుతున్నారని మండిపాటు
అక్రమాలు బయటపడకుండా ఫైళ్లను తగులబెట్టడాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. కొన్ని రోజులుగా ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయని అన్నారు. అక్రమాలను వెలికి తీస్తామనే భయంతోనే ఫైళ్లను తగులబెడుతున్నారని దుయ్యబట్టారు. చివరకు తిరుపతిలో కూడా స్వామివారి ధనాన్ని దోచుకున్నారని, కోట్లు స్వాహా చేశారని, అవన్నీ బయటకు వస్తాయనే భయంతో అక్కడ కూడా రికార్డులను తగులబెట్టారని మండిపడ్డారు.
బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి అవినీతి వ్యవహారాలపై అనేక ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ జరుగుతోందని అచ్చెన్న తెలిపారు.