పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
- రాష్ట్ర సచివాలయం నుంచి పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్
- హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు
- ఉపాధి హామీ పథకంపై పవన్ దిశానిర్దేశం
ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చుపెట్టాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు.