వల్లభనేని వంశీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసులు?
- కొన్నిరోజుల కిందటే నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు
- టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వంశీ
- మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు అరెస్టైన వారిలో కొంతమంది పోలీసులకు చెప్పారు. దీంతో వంశీని కూడా నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం అతను ఈ కేసులో ఏ71గా ఉన్నాడు.
ఈ కేసులో పోలీసులు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఏ21 మొండెం రాంబాబు, ఏ50 అమరేంద్రరెడ్డి, ఏ62 ఇమ్రాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే దీనిపై పోలీసుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది.