ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ గవర్నర్

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు ఆర్డినెన్స్ జారీ చేశారు. రూ.1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేశారు. 

40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది. ఏపీలో ఇటీవలే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. 

కూటమి ప్రభుత్వం ఇటీవలే అధికారం చేపట్టిన నేపథ్యంలో, సెప్టెంబరులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Vote On Account Budget
Ordinance
Governor
Andhra Pradesh

More Telugu News