ఫుట్‌బాల్ స్టేడియంపైకి హెజ్బొల్లా రాకెట్ దాడి.. 12 మంది చిన్నారుల మృతి.. వీడియో ఇదిగో!
- ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం
- హమాస్‌కు మద్దతుగా బరిలోకి హెజ్బొల్లా
- మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరిక
- తమకు సంబంధం లేదన్నహెజ్బొల్లా
ప్రస్తుతం రాకెట్ దాడి జరిగిన ప్రాంతం సిరియాలో ఉండేది. 1967లో దీనిని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తాజా దాడిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. హెజ్బొల్లా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దీనిపై స్పందించిన హెజ్బొల్లా ఆ దాడితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపింది.