గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం
- గ్రామాల్లో తాగునీటి సరఫరా అంశంపై సమీక్ష
- ప్రపంచ బ్యాంకు ఏ మేరకు నిధులు ఇవ్వగలదన్న అంశంపై చర్చ
గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలియజేశారు. గత ప్రభుత్వంలా నిధులను పక్కదారి పట్టించబోమని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ తో పాటు ప్రపంచ బ్యాంకు జలవనరుల విభాగం సలహాదారు రమేశ్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్, ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.