రేపు విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి

Union minister Kumaraswamy will come to AP tomorrow
  • ఏపీ పర్యటనకు వస్తున్న కుమారస్వామి
  • జులై 10వ తేదీ రాత్రి 7 గంటలకు విశాఖ చేరిక
  • ఎల్లుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సమీక్ష
  • ఇటీవల కుమారస్వామిని కలిసి స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలన్న బీజేపీ ఎంపీలు
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రేపు (జులై 10) ఏపీలో పర్యటించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు కుమారస్వామి విశాఖ రానున్నారు. ఎల్లుండి (జులై 11) ఉదయం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి కుమారస్వామిని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ లో విలీనం చేయాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో, కుమారస్వామి విశాఖ వస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement
Kumaraswamy
Visakhapatnam
Vizag Steel Plant
BJP
Andhra Pradesh

More Telugu News