టీటీడీలో ప్రక్షాళన... కొనసాగుతున్న విజిలెన్స్ విచారణ
- ఏపీలో కొత్త ప్రభుత్వం
- టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్న సీఎం చంద్రబాబు
- టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు
టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల్లో 40 మంది అధికారులతో ఈ సోదాలు చేపట్టారు. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పరిణామాలు, కార్యకలాపాలు, లావాదేవీలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు.
విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు తిరుపతిలో స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. బీజేపీ నేత నవీన్ పలు వివరాలను, తన వద్ద ఉన్న ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందించారు.