లడఖ్ లో ముగ్గురు ఏపీ జవాన్లు మరణించారన్న వార్త నన్ను కలచివేసింది: చంద్రబాబు
- లడఖ్ లో సైనిక శిక్షణలో ప్రమాదం
- ఆకస్మిక వరదలకు నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు
- ఐదుగురు భారత జవాన్ల మృతి
- మృతుల్లో ముగ్గురు ఏపీ జవాన్లు
"లడఖ్ లో టీ-72 యుద్ధ ట్యాంకు నదిలో కొట్టుకుపోయిన ఘటనలో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్లు చనిపోయారన్న ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముత్తుమల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ ల మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.