కొండగట్టుకు చేరుకున్న అయోధ్య రాముడి బాణం

Gold and Silver Bow For Lord Ram Came To Kondagattu
  • రామయ్యకు నిజామాబాద్ భక్తుడి కానుక
  • దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల దర్శనం
  • అంజన్న సన్నిధిలో రామ బాణానికి ప్రత్యేక పూజలు
అయోధ్య బాల రాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం ప్రస్తుతం కొండగట్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంజన్న సన్నిధికి చేరింది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాల రాముడి కోసం ఈ బాణాన్ని తయారు చేయించాడు.

ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్యకు తీసుకువెళ్లి బాలరాముడికి సమర్పిస్తామని శ్రీనివాస్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఈ బాణానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించాడు. ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, భక్తులు పాల్గొన్నారు.

Go Back to Shorts
Gold and Silver Bow
Lord Ram
Ayodhya Ram
Kondagattu
Nizamabad devotee

More Telugu News