ఏపీ టెట్-2024 ఫలితాల విడుదల... ఇక డీఎస్సీకి సన్నద్ధం కావాలన్న మంత్రి లోకేశ్
- గత ఫిబ్రవరిలో టెట్ నిర్వహణ
- ఉత్తీర్ణత సాధించిన 1,37,904 మంది అభ్యర్థులు
- మరోసారి టెట్ నిర్వహిస్తామన్న మంత్రి లోకేశ్
- ఫలితాల అనంతరం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని వెల్లడి
టెట్ ఫలితాల విడుదల అనంతరం, మంత్రి నారా లోకేశ్ స్పందించారు. టెట్ లో అర్హత సాధించినవారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
టెట్ ఫలితాల కోసం 2.35 లక్షల మంది ఎదురుచూశారని వెల్లడించారు. డీఎస్సీలో టెట్ అర్హతకు 20 శాతం వెయిటేజి ఉండడంతో అందరూ ఆత్రుతగా ఎదురుచూశారని వివరించారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. టెట్ ఫలితాల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.