అమరావతి రైతుల కృతజ్ఞతా యాత్ర
- తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన మహిళలు
- వెంకటపాలెంలోని వెంకటేశ్వర ఆలయం నుంచి తిరుమలకు యాత్ర
- పాదయాత్రను ప్రారంభించిన తాడికొండ ఎమ్మెల్యే
సోమవారం ఉదయం రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కృతజ్ఞతా యాత్ర ప్రారంభించారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర మొదలుపెట్టారు. అమరావతి రైతుల యాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. కాగా, రైతులు చేపట్టిన ఈ పాదయాత్ర సుమారు 20 రోజుల పాటు కొనసాగనుందని, తిరుమల చేరుకున్నాక రైతులు వెంకన్నకు మొక్కులు చెల్లించుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు.