జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల

Indian 2 trailer will be out on June 25
  • కమల్ హాసన్, శంకర్ కాంబోలో భారతీయుడు సీక్వెల్
  • జులై 12న భారతీయుడు-2 వరల్డ్ వైడ్ రిలీజ్ 
  • పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న భారీ చిత్రం
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. 

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి.

తాజాగా ‘భారతీయుడు 2’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అందులో ముస‌లి పాత్ర‌లోని క‌మ‌ల్ హాస‌న్ ట్రాలీ బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతుండడం చూడొచ్చు.

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ మెప్పించారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ‘భారతీయుడు 2’ రానుంది. మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.  

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Advertisement
Indian 2
Trailer
Kamal Haasan
Shankar
Lyca Productions

More Telugu News