గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్లు

ఈరోజు తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని... తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు.

ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని... కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు.

తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను రాజాసింగ్ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రధాని మోదీ, పీఎంవో ఇండియా, అమిత్ షా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ సీఎంవోలను ఆయన ట్యాగ్ చేశారు.


More Telugu News