'భార‌తీయుడు 2' నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భార‌తీయుడు 2' నుంచి ల‌వ్ మెలోడీ సాంగ్ రిలీజ్!

Bharateeyudu 2 Song released
  • కమల్ ప్రధాన పాత్రగా 'భారతీయుడు 2'
  • ప్రత్యేక ఆకర్షణగా భారీతారాగణం 
  • సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ 
  • జులై 12వ తేదీన గ్రాండ్ రిలీజ్

క‌మ‌ల్ హాస‌న్‌ .. శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

1996లో క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌ విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రూపొందుతోంది. అభిమానులు, సినీప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూస్తోన్న ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ వేగం పుంజుకున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన 'ఇండియ‌న్ 2' ఇంట్రో వీడియోతో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘శౌర..’ అనే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. 

ఈ క్ర‌మంలో బుధ‌వారం మేక‌ర్స్ ‘చెంగల్వ చేయందేనా..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీత సార‌థ్యంలో రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట‌ను అబ్బి, శ్రుతికా స‌ముద్రాల పాడారు. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement
Kamal Haasan
Kajal Agarwal
Shankar
Anirudh

More Telugu News