అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం
- ఈ నెల 14న అల్ఫారెట్టాలో రోడ్డు ప్రమాదం
- అతివేగం కారణంగా బోల్తాపడిన వాహనం
- ప్రమాద సమయంలో కారులో ఐదుగురు
మృతులను అల్ఫారెట్టా హైస్కూల్, జార్జియా యూనివర్సిటీకి చెందిన ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల, అన్విశర్మగా గుర్తించారు. వీరిలో శ్రియ అవసరాల తెలుగమ్మాయి. రిత్విక్ సోమేపల్లి, మొహమ్మద్ లియాకత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారును డ్రైవ్ చేసింది లియాకత్ అని పోలీసులు తెలిపారు. అతివేగం కారణంగా కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తాపడినట్టు చెప్పారు. ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా అన్విశర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.