Jagan Kosam Siddham: మరో 11 రోజుల్లో ఎన్నికలు... వైసీపీ కొత్తగా చేపట్టిన కార్యక్రమం ఇదే!

YCP starts new initiative ahead of polls
షార్ట్స్‌లో చూడండి
గడప గడపకు మన ప్రభుత్వం, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలను తీసుకువచ్చిన వైసీపీ... మరో 11 రోజుల్లో ఎన్నికలు రానుండగా కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం పేరు... 'కలలు నిజం చేయడానికి.... జగన్ కోసం సిద్ధం'. ఇప్పటికే దీనికి సంబంధించిన హోర్డింగ్ లు, పోస్టర్లు రాష్ట్రవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. 

ఇటీవల సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ చేరవేయడమే 'జగన్ కోసం సిద్ధం' కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రజలే తమ స్టార్ క్యాంపెయినర్లని ఇటీవల సభల్లో తరచుగా చెబుతున్న సీఎం జగన్... ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కూడా తమ ప్రచార పర్వంలో భాగం చేయనున్నారు.
Go Back to Shorts
Jagan Kosam Siddham
YSRCP
Manifesto
Andhra Pradesh

More Telugu News