మంగళగిరిలో లోకేశ్ విజయం విషయంలో ఎలాంటి సందేహం లేదు: నారా బ్రాహ్మణి
- మంగళగిరిలో నేడు కూడా కొనసాగిన నారా బ్రాహ్మణి పర్యటన
- లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారం
- వివిధ వర్గాల వారితో భేటీలు
"మంగళగిరి నియోజకవర్గంలో మావారు నారా లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించాను. స్వర్ణకారులు, చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకున్నాను. లోకేశ్ గారి విజయంలో ఎలాంటి సందేహం లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, మంగళగిరి గోల్డెన్ హబ్ గా మారడం ఖాయమని వారికి భరోసా ఇచ్చాను. ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యాపారాలు, వృత్తులు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో క్షేత్రస్థాయిలో చూశాను.
మంగళగిరిలో చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న లోకేశ్ గారికి మద్దతు ఇవ్వాలని కోరాను. విజయ పచ్చళ్ల కేంద్రాన్ని సందర్శించి వారితో మాట్లాడాను. పట్టణంలో వివిధ వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను" అంటూ నారా బ్రాహ్మణి వివరించారు.

