రుణమాఫీ చేయకుంటే మాకు ఈ అధికారం ఎందుకు?: రేవంత్ రెడ్డి
- ఆరు నూరైనా సరే ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరతామని వెల్లడి
- స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలని హరీశ్ రావుకు సూచన
- సెమీ ఫైనల్ లో బీఆర్ఎస్ ను ఓడించామని, ఫైనల్ లో బీజేపీని ఓడిస్తామని ధీమా
ఆరు నూరైనా సరే ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు రూ.2 లక్షల లోపున్న వాటిని ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేకపోతే తమకు అధికారమెందుకని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని చెబుతూ.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను సిద్ధం చేసి పెట్టుకోవాలని హరీశ్ రావుకు సీఎం సూచించారు. సెమీ ఫైనల్ గా భావించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై విజయం సాధించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అదేవిధంగా ఫైనల్ గా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 14 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.