స‌లార్ మూవీ చూస్తూ.. ఈ సినిమాలోని బైక్‌ను గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స‌లార్ మూవీ చూస్తూ.. ఈ సినిమాలోని బైక్‌ను గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్!

Hombale films Offers win Salaar Bike
  • ఈ నెల 21న సాయంత్రం 5.30 గంట‌ల‌కు స్టార్ మాలో స‌లార్ ప్ర‌సారం
  • మూవీ చూస్తూ స‌లార్ బైక్ గెలుచుకునే అవ‌కాశం క‌ల్పించిన హోంబ‌లే ఫిలిమ్స్
  • సినిమా ప్ర‌సార స‌మ‌యంలో స్క్రీన్‌పై బైక్ ఎన్నిసార్లు క‌నిపించిందో ప్రేక్ష‌కులు లెక్కించాలి
  • అలా స‌రైన స‌మాధానం చెప్పిన వారికి బైక్ గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబోలో వ‌చ్చిన స‌లార్ మూవీ భారీ విజ‌యాన్ని అందుకున్న విష‌యం తెలిసిందే. 2023 డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 700 కోట్ల‌కుపైగానే వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత ఓటీటీలోనూ స‌లార్ సంద‌డి చేసింది. ఇప్పుడు బుల్లితెర‌పైకి వ‌స్తోంది. ఈ నెల 21న సాయంత్రం 5.30 గంట‌ల‌కు స్టార్ మాలో ప్ర‌సారం కానుంది. స‌లార్‌ను చూస్తూ.. ఆ సినిమాలో ప్రభాస్ నడిపిన బైక్ ను గెలుచుకోవ‌చ్చ‌ని తాజాగా ఈ సినిమాను నిర్మించిన హోంబ‌లే ఫిలిమ్స్ ఎక్స్ (ట్విట‌ర్) వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఎలా స‌లార్ బైక్‌ను సొంతం చేసుకోవాలో కూడా నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది.

స‌లార్ బైక్‌ను ఎలా గెలుచుకోవ‌చ్చంటే..!
సినిమా ప్ర‌సారం అవుతున్న స‌మ‌యంలో స్క్రీన్‌పై ఒక‌వైపు బైక్ క‌నిపిస్తూ ఉంటుంది. అలా ఆ బైక్ ఎన్నిసార్లు స్క్రీన్ మీద క‌నిపించిందో ప్రేక్ష‌కులు కౌంట్ చేయాలి. 5.30 గంట‌ల నుంచి 8.00 గంట‌ల మ‌ధ్య ఇలా బైక్ స్క్రీన్‌పై ఎన్నిసార్లు క‌నిపించిందో లెక్క‌బెట్టాలి. ఆ త‌ర్వాత 8 గంట‌ల‌కు ఎస్సెమ్మెస్ లైన్స్ ఓపెన్ అవుతాయి. ఆ స‌మ‌యంలో SALAAR అని టైప్ చేసి.. బైక్ స్క్రీన్ మీద ఎన్నిసార్లు క‌నిపించిందో ఆ కౌంట్ వేసి 9222211199 నంబ‌ర్‌కు ఎస్సెమ్మెస్ చేయాలి. మీ స‌మాధానం క‌రెక్ట్ అయితే మీకు స‌లార్ బైక్ గెలుచుకునే చాన్స్ ద‌క్కుతుంది.
Advertisement
Salaar
Hombale films
Salaar Bike
Tollywood
Prabhas

More Telugu News