నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్..!
- మరోసారి కుమారుడు జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన భారత క్రికెటర్
- పంజాబ్ జెర్సీపై కొడుకు పేరుతో ఇన్‌స్టాలో ఫొటోలు పంచుకున్న వైనం
- భార్యతో విడాకుల తర్వాత కుమారుడికి దూరమైన ధావన్
కాగా, శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధావన్ కొడుకు మైనర్ కావడంతో బాబు తల్లి దగ్గరే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఆయేషా ముఖర్జీ ఆస్ట్రేలియన్ పౌరురాలు కావడంతో ఆమె కుమారుడిని తీసుకుని అక్కడికి వెళ్లిపోయింది. న్యాయస్థానం ధావన్‌కు కుమారుడిని చూసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. ఆమె మాత్రం కనీసం వీడియో కాల్‌లో అయినా అతనికి తన కొడుకునే చూసుకునేందుకు అంగీకరించడం లేదు.
దీంతో శిఖర్ ధావన్ తన కుమారుడు జోరావర్ దూరం కావడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. తరచూ జోరావర్‌ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌లో ధావన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు సారధిగా కొనసాగుతున్నాడు.