రావణుడి ప్రతిరూపం అయిన చంద్రబాబు నోటి వెంట ఇలాంటి అబద్ధాలు కాక ఇంకేం వస్తాయి?: మంత్రి రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రావణుడి ప్రతిరూపం అయిన చంద్రబాబు నోటి వెంట ఇలాంటి అబద్ధాలు కాక ఇంకేం వస్తాయి?: మంత్రి రోజా

Roja counters Chandrababu remarks on YCP ruling
  • జగన్ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగాయన్న చంద్రబాబు
  • నువ్వు కూల్చిన ఎన్నో ఆలయాలను జగన్ పునర్ నిర్మించారన్న రోజా
  • నీలాంటి రాక్షసులు చెప్పేదే చరిత్ర కాదు అంటూ ఫైర్
  • రామరాజ్యాన్ని పోలిన జగనన్న పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని వెల్లడి
వైసీపీ పాలనలో 'హిందూ భక్తుల మనోభావాలపై గొడ్డలి పోట్లు' అనదగ్గ సుమారు 160 ఘటనలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ట్వీట్ పై మంత్రి రోజా స్పందించారు. రావణుడి ప్రతిరూపం అయిన చంద్రబాబు నోటివెంట ఇలాంటి అబద్ధాలు కాకుండా ఇంకేం వస్తాయని విమర్శించారు. 

"విజయవాడలో అభివృద్ధి పేరిట నువ్వు కూల్చేసిన ఎన్నో ఆలయాలను పునర్ నిర్మించింది జగన్ ప్రభుత్వం. మా ప్రభుత్వం రామతీర్థానికి భారీగా నిధులు కేటాయించి దాన్ని మహాద్భుతంగా నిర్మిస్తోంది. నీలాంటి రాక్షసులు చెప్పేదే చరిత్ర కాదు... రామరాజ్యాన్ని పోలిన జగనన్న పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఈ ఎన్నికలతో మీ తెలుగుదేశం పార్టీ చరిత్ర సమాప్తం కానుంది. ప్రజకు ఇక నిత్య దీపావళి" అంటూ రోజా ట్వీట్ చేశారు.
Advertisement
Roja
Chandrababu
Jagan
YSRCP
TDP

More Telugu News