హరిహర వీరమల్లు టీజర్ వచ్చేస్తోంది
- మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో.. అంటూ పోస్టర్
- ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా పవన్ కల్యాణ్
- హరిహర వీరమల్లు షూటింగ్ ఆలస్యం
ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో..’ అంటూ పవన్ కల్యాణ్ ఫొటోతో ఈ పోస్టర్ ను రూపొందించారు. హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రిష్ టీం ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలతో పవన్ కల్యాణ్ అభిమానులలో హరిహర వీరమల్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.