సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్
- విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారన్న వెల్లంపల్లి
- చంద్రబాబుకు విజయవాడలో తిరిగే అర్హత లేదని వ్యాఖ్య
- పవన్ హెచ్చరికలకు జగన్ భయపడరన్న వెల్లంపల్లి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న హెచ్చరికలకు జగన్ భయపడరని వెల్లంపల్లి అన్నారు. ఆరోజుల్లోనే కేంద్రంలో ఉన్న సోనియాగాంధీని ఎదిరించిన వ్యక్తి జగన్ అని... పవన్ వంటి పిల్ల రాజకీయ నాయకుల వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవడం అనవసరమని చెప్పారు. పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత మాట్లాడాలని ఎద్దేవా చేశారు. సినిమా యాక్టర్ల గురించి ఎవరూ భయపడరని అన్నారు. జగన్ బస్సు యాత్రకు విజయవాడ నగర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.