మరో విడత ఉమ్మడిగా ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్... షెడ్యూల్ ఖరారు
- గత రెండ్రోజులుగా ఉమ్మడి సభల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్
- ఈ నెల 16, 17 తేదీల్లోనూ జంటగా ప్రచారం
- ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా చంద్రబాబు బిజీ
ఈ నెల 16, 17 తేదీల్లో ఇరువురు కలిసి ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ రోడ్ షోల్లో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు. ఏప్రిల్ 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఉమ్మడి సభలు నిర్వహిస్తారు.
కాగా, చంద్రబాబు నేడు వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో ప్రజాగళం యాత్ర చేపట్టనున్నారు. రేపు తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాగళం కొనసాగిస్తారు. ఎల్లుండి (ఏప్రిల్ 14) పాయకరావుపేట, చోడవరం, గాజువాక... ఏప్రిల్ 15న రాజాం, పలాస, టెక్కలిలో ప్రజాగళం సభలకు హాజరవుతారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ఏప్రిల్ 16 వరకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో ప్రచారం సాగించే అవకాశాలున్నాయి.