చెన్నై జోరుకు కళ్లెం... సన్ రైజర్స్ ముందు ఈజీ టార్గెట్
- ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ × చెన్నై సూపర్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసిన చెన్నై
- మరోసారి తన కెప్టెన్సీ ప్రతిభను ప్రదర్శించిన కమిన్స్
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. శివమ్ దూబే క్రీజులో ఉన్న సమయంలో చెన్నై జట్టు ఈజీగా 200 పరుగులు చేస్తుందనిపించింది.
అయితే, దూబేను అవుట్ చేయడం ద్వారా కమిన్స్ చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. శివమ్ దూబే 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45 పరుగులు చేశాడు. రహానే 35, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26, రవీంద్ర జడేజా 31 (నాటౌట్) పరుగులు చేశారు. డారిల్ మిచెల్ 13 పరుగులకు అవుట్ కాగా, ధోనీ రెండు బంతులాడి 1 పరుగుతో నాటౌట్ గా నిలిచాడు.
సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 1, భువనేశ్వర్ కుమార్ 1, నటరాజన్ 1, షాబాజ్ అహ్మద్ 1, జయదేవ్ ఉనద్కట్ 1 వికెట్ తీశారు.
కాగా, ఈ మ్యాచ్ ను తిలకించేందుకు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు.