పింఛన్లు ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలి: ఈసీకి లేఖ రాసిన కనకమేడల
- ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
- పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలన్న ఈసీ
- పింఛనుదారులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవాలన్న సజ్జల
- పింఛన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కనకమేడల
దీనిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. పింఛన్ల పంపిణీ అంశంపై ఆయన ఈసీకి లేఖ రాశారు. పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి సచివాలయ సిబ్బందిని వినియోగించాలని సూచించారు. పింఛన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తన లేఖలో ఆరోపించారు.