అకీరా నంద‌న్ ఆస‌క్తిక‌ర వీడియోను పోస్ట్ చేసిన రేణు దేశాయ్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అకీరా నంద‌న్ ఆస‌క్తిక‌ర వీడియోను పోస్ట్ చేసిన రేణు దేశాయ్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Renu Desai Posted Interesting Video of Son Akira Nandan on Instagram
  • 'మై వారియ‌ర్' అంటూ.. ఇంట్రెస్టింగ్ వీడియో పంచుకున్న రేణు దేశాయ్‌
  • మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుక‌ల‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిన అకీరా
  • లాంగ్ హెయిర్ స్టైల్‌తో వింటేజ్ ప‌వ‌న్‌ను త‌ల‌పించిన మెగా వార‌సుడు
  • సంగీతంపై మ‌క్కువ‌తో అమెరికా ఫిలిం స్కూల్లో మ్యూజిక్ నేర్చుకుంటున్న వైనం
కుమారుడు అకీరా నంద‌న్‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోను తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ వీడియోలో అకీరా ఓ భారీ శివలింగం ముందు ఆధ్యాత్మికంగా క‌నిపిస్తూనే.. మ‌రోవైపు సూర్యాస్త‌మ‌యంలో ఏదో క‌స‌ర‌త్తు చేస్తూ క‌నిపించడం మ‌నం చూడొచ్చు. ఈ వీడియో కింద‌ "మై వారియ‌ర్‌.. సూర్యాస్త‌మ‌యంలో త‌న‌కు న‌చ్చిన ప్ర‌దేశంలో త‌న‌కు కావాల్సింది వెతుకుతున్నాడు" అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చారు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఇదిలాఉంటే.. అకీరా ఈ ఏడాది ప్రారంభంలో బెంగ‌ళూరులో జ‌రిగిన మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుక‌ల‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిన విష‌యం తెలిసిందే. లాంగ్ హెయిర్ స్టైల్‌తో వింటేజ్ ప‌వ‌న్‌ను దింపేశాడు. అలాగే ఈ సంబ‌రాల్లో అకీరా పియానో ప్లే చేసి అంద‌రి ప్ర‌శంస‌లు కూడా పొందాడు. ఇక తండ్రి బాట‌లోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, అకీరా మాత్రం న‌ట‌న‌పై కాకుండా సంగీతంపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాడు. 

ఇప్ప‌టికే అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్లో మ్యూజిక్ నేర్చుకుంటున్నాడ‌ని స‌మాచారం. దీనిలో భాగంగానే బెంగ‌ళూరులో మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబ‌రాల్లో పియానో ప్లే చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. ఇక అకీరా నంద‌న్‌తో పాటు కూతురు ఆద్యాకు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను రేణు దేశాయ్ త‌ర‌చూ సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తుంటార‌నే విష‌యం తెలిసిందే.
Advertisement
Renu Desai
Akira Nandan
Instagram
Viral Videos
Social Media

More Telugu News