బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు
- సంతోష్ కుమార్ పై భూ కబ్జా ఆరోపణలు
- బంజారాహిల్స్ రోడ్ నెం.14లో స్థలంపై కన్నేశారని ఫిర్యాదు
- తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నించారని ఆరోపణ
- పలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు
సంతోష్ కుమార్ పై నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవయుగ సంస్థ బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని సర్వే నెం.129/54లో 1,350 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది.
అయితే, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జోగినపల్లి సంతోష్ కుమార్, లింగారెడ్డి శ్రీధర్ లపై నవయుగ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు నేపథ్యంలో, సంతోష్ కుమార్, శ్రీధర్ లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.