శారీ రన్ ప్రారంభించడం ఆనందం కలిగించింది: నారా బ్రాహ్మణి
- హైదరాబాదులో నిన్న శారీ రన్
- నెక్లెస్ రోడ్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన నారా బ్రాహ్మణి
- ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళలను కలుసుకున్నానని వెల్లడి
నిన్న హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ వద్ద తనీరా సంస్థ నిర్వహించిన శారీ రన్ ను ప్రారంభించానని వెల్లడించారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళలను, మహిళా కార్యసాధకులను కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని నారా బ్రాహ్మణి తెలిపారు. ప్రకాశవంతమైన, వివిధ రంగుల్లో, కళాత్మకంగా నేయబడిన చీరలు ధరించిన ఆ అతివలను ఈ పరుగులో పాల్గొన్నారని, తాను కూడా మంగళగిరి చేనేత చీరతో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరయ్యానని వివరించారు.
