సీఎం జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు: కేశినేని నాని
- మరోసారి విజయవాడ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారన్న ఎంపీ
- వైసీపీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంపై స్పందించిన కేశినేని నాని
- సీఎం జగన్‌తో దిగిన ఫొటోని షేర్ చేసి హర్షం వ్యక్తం చేసిన ఎంపీ
కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కేశినేని నాని గెలుపొందారు. అయితే 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేమంటూ టీడీపీ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందడంలో ఆయన పార్టీ మారారు. అధికార వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలావుంచితే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 24 ఎంపీ స్థానాలకు నేడు వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.