Allu Arjun: అల్లు అర్జున్ ను కలుసుకుని కన్నీళ్లను ఆపుకోలేకపోయిన వీరాభిమాని... వీడియో ఇదిగో!

A fan gets emotional for the first time meeting with Allu Arjun
షార్ట్స్‌లో చూడండి
అభిమానులే నా బలం అని గర్వంగా చెప్పుకునే టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. వీలు చిక్కినప్పుడల్లా తన అభిమానులను కలుసుకునేందుకు అల్లు అర్జున్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఓ వీరాభిమానికి తనను కలిసే అవకాశం ఇచ్చారు. ఆ అభిమాని అల్లు అర్జున్ ను ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. 

తన ఆరాధ్య హీరో ఎదురుగా నిలబడి, తనతో మాట్లాడుతుంటే ఆ అభిమానికి సంతోషంతో కన్నీళ్లు ఆగలేదు. అల్లు అర్జున్ సమక్షంలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యాడు. అల్లు అర్జున్ ఎంతో ఆదరాభిమానాలతో ఆ అభిమానిని అక్కున చేర్చుకున్నారు. అప్యాయంగా అతడితో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Allu Arjun
Fan
Emotinal
Icon Star
Tollywood

More Telugu News