తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు
- దరఖాస్తుకు మరో రెండు రోజుల గడువు ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
- రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్
- ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. షెడ్యూల్ మేరకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే దరఖాస్తు గడువును రెండు రోజులు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. https://www.tspsc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.