తెలుగు డీఎంఎఫ్... ఇది గేమ్ చేంజర్ కానుంది: మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు డీఎంఎఫ్... ఇది గేమ్ చేంజర్ కానుంది: మహేశ్ బాబు

Mahesh Babu opines on TeluguDMF
  • తెలుగు డిజిటల్ కంటెంట్  క్రియేటర్ల కోసం ఐక్య వేదిక
  • ఇటీవల లాంచ్ చేసిన చిరంజీవి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • తెలుగు డీఎంఫ్... కంటెంట్ క్రియేటర్లందరినీ ఏకం చేస్తుందన్న మహేశ్
తెలుగు మీడియా రంగంలో తొలిసారిగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఓ ఐక్య వేదిక ఏర్పడింది. దాని పేరు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగుడీఎంఎఫ్). ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు డీఎంఎఫ్ వెబ్ సైట్ ను లాంచ్ చేయగా, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోగో, పోస్టర్ ఆవిష్కరించారు. 

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. తెలుగు డీఎంఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లందరూ ఏకమవుతారని వివరించారు. ఇది కచ్చితంగా ఓ గేమ్ చేంజర్ అవుతుందని, మీడియా రంగంలో విప్లవాత్మక ఘట్టం అని అభివర్ణించారు. 

ఈ వేదిక ఏర్పాటు వెనుక ఉన్న మేధో దార్శనికులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటున్నట్టు మహేశ్ బాబు వెల్లడించారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
Advertisement
TeluguDMF
Mahesh Babu
Digital Content Creators
Tollywood

More Telugu News