ఊపందుకున్న కొనుగోళ్లు.. భారీగాపెరిగిన బంగారం ధరలు
- 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 930 పెరుగుదల
- హైదరాబాద్‌లో 24 కేరెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 64,090కి చేరిక
- రూ. 500 పెరిగి రూ. 75 వేలకు చేరుకున్న వెండి
పెరిగిన ధరతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 కేరెట్ల బంగారం ధర రూ. 64,090కి చేరింది. 22 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర 58,750కి పెరిగింది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,240 కాగా, 22 కేరెట్ల ధర రూ. 58,900గా ఉంది. చెన్నైలో వరుసగా రూ. 63,720, రూ. 59,400 కాగా, బెంగళూరులో రూ. 64,090, రూ.58,750గా నమోదయ్యాయి.