వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది: అచ్చెన్నాయుడు
- ఓటమి భయంతో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారన్న అచ్చెన్న
- పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని మండిపాటు
- జగన్ ఇంటికి పోవడం ఖాయమని వ్యాఖ్య
వైసీపీ పాలనలో మీడియాకు, పత్రికలకు, జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అక్రమ పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు.