ఆ వార్తలు నమ్మి భావోద్వేగాలకు గురికావొద్దు: రాజమండ్రి రూరల్ కార్యకర్తలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచన
- రాజమండ్రి రూరల్ స్థానంపై అనిశ్చితి
- జనసేన పోటీ చేస్తుందంటున్న కందుల దుర్గేశ్
- తనకు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని వెల్లడి
- రాజమండ్రి రూరల్ తనదే అంటున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
"రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మనవి... టీవీ చానళ్లలో, వాట్సాప్ మెసేజ్ లలో వస్తున్న వార్తలు ఊహాజనితం. అవి నమ్మి భావోద్వేగాలకు గురికావొద్దు. చంద్రబాబు ఆదేశాల మేరకు కచ్చితంగా నేను పోటీలో ఉంటాను. దీంట్లో ఎలాంటి అనుమానాలకు తావులేదు. దీనిపై త్వరలోనే చంద్రబాబు ప్రకటన చేస్తారు" అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.