పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
- ఏపీ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్
- నరసాపురం మండలం పీఎం లంకలో డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ సందర్శన
- శిక్షణ పొందుతున్న విద్యార్థులు, మహిళలతో మాటామంతి
- పీఎం లంకలో సముద్ర కోత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి
ఈ సందర్భంగా నిర్మల మీడియాతో మాట్లాడుతూ... పీఎం లంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఇది పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని, ఈ తరహా ప్రాజెక్టు దేశంలో ఇదే మొదటిదని తెలిపారు.
పీఎం లంకలో రక్షణ గోడ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

