చంద్రబాబూ, మీకు ఈ చాలెంజ్ లు ఎందుకు?: మంత్రి రోజా

AP Minister Roja take a dig at TDP Chief Chandrababu
  • సీఎం జగన్ కు చంద్రబాబు బహిరంగ సవాల్
  • వందలాది హామీలిచ్చి మేనిఫెస్టోను చంకలో దాచేస్తారంటూ చంద్రబాబుపై రోజా ఫైర్
  • మీలాంటి మోసగాడ్ని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ అంటూ ట్వీట్
సీఎం జగన్ కు చంద్రబాబు బహిరంగ సవాల్ విసరడంపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. వందలాది హామీలు ఇచ్చి మేనిఫెస్టోను చంకలో దాచేసే చంద్రబాబూ... మీకు ఈ చాలెంజ్ లు ఎందుకు? అని ప్రశ్నించారు. 

"మీలాంటి మోసగాడిని ఇన్నాళ్లు మోయడమే ఎక్కువ. ఇక మీ సేవలు చాలించండి. పోయి మనవడితో ఆడుకోండి" అంటూ రోజా ట్వీట్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఓపెన్ చాలెంజ్ ట్వీట్ ను కూడా పంచుకున్నారు. 

విధ్వంస నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి, ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ... నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అంటూ  చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొనడం తెలిసిందే.
Go Back to Shorts
Roja
Chandrababu
Challenge
Jagan
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News