రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: గల్లా జయదేవ్
- వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన
- ఇకపై బిజినెస్ పైనే పూర్తిగా దృష్టిసారించనున్నట్లు వెల్లడి
- గుంటూరు ప్రజలకు ఆత్మీయ విందు ఇచ్చిన టీడీపీ నేత
వ్యాపారవేత్తగా రాణిస్తూనే ఎంపీగా రాష్ట్ర ప్రజలకు సేవచేశారు. ఆయనకు అమరరాజా బ్యాటరీస్ కంపెనీతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సినీనటుడు కృష్ణ పెద్దల్లుడు, హీరో మహేశ్ బాబుకు గల్లా జయదేవ్ స్వయానా బావగారు. మహేశ్ బాబు సోదరి భర్త. ఎంపీగా రెండు పర్యాయాలు గెలుపొందినా గల్లా జయదేవ్.. ఈసారి పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆదివారం గుంటూరు ప్రజలకు, పార్టీ కార్యకర్తలు, నేతలకు గల్లా జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు.