ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా తెలంగాణ యువతి

ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జిగా తెలంగాణ యువతి

Telangana woman selected for AP Civil Judge
  • గతేడాది జూనియర్ సివిల్ జడ్జి కోసం పరీక్ష నిర్వహించిన ఏపీ హైకోర్టు
  • ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయిన హనుమకొండ యువతి అలేఖ్య
  • సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న అలేఖ్య తల్లి
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ సివిల్ జడ్జిగా తెలంగాణ యువతి ఎంపికయ్యారు. ఏపీ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి నియామక పరీక్ష ఫలితాల్లో హనుమకొండకు చెందిన అలేఖ్య (24) ప్రథమస్థానం సాధించారు. హైదరాబాద్‌లోని పెండేకంటి కళాశాలలో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణులైన అలేఖ్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. 

గతేడాది ఏపీ హైకోర్టు నియామకాల్లో అలేఖ్య ఫస్ట్ క్లాస్ సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. అలేఖ్య తల్లి మాధవీలత సీనియర్ సివిల్ జడ్జిగా రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో పనిచేస్తున్నారు. సివిల్ జడ్జిగా ఎంపికైన అలేఖ్యను రంగారెడ్డి జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దీకొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి అభినందించారు.
Advertisement
Alekhya
Hanumakonda
AP High Court
Civil Judge
Telangana

More Telugu News