'భామాకలాపం 2' నుంచి ఫస్టు సింగిల్ రెడీ!
- 'ఆహా'లో ఆదరణపొందిన 'భామాకలాపం'
- ప్రధానమైన పాత్రల్లో ప్రియమణి - శరణ్య ప్రదీప్
- సీక్వెల్ గా రూపొందిన 'భామాకలాపం 2'
- డార్క్ క్రైమ్ కామెడీ జోనర్లో సాగే కథ
అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'భామాకలాపం 2' నిర్మితమైంది. ప్రియమణి - శరణ్య ప్రదీప్ ప్రధానమైన పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు 'పరుగే వింత పరుగే' పాటను వదలనున్నారనే విషయాన్ని చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
'భామాకలాపం' ఫస్టు పార్టులో అనుపమ (ప్రియమణి)కి ... ఇరుగు పొరుగు ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ధ్యాస ఉంటుంది. అదే ఆమె ఒక హత్య చేసేవరకూ తీసుకెళుతుంది. దానిని నుంచి బయటపడటానికి ఆమె ఏం చేస్తుందనే సన్నివేశాలకు కామెడీ టచ్ ఇస్తూ ఆ కథ నడుస్తుంది. ఇక సెకండ్ పార్టు ఎలా ఉంటుందనేది చూడాలి.